Monday, May 31, 2010

అద్వైతం

 
మృత్తిక వలె, విత్తనము వలె
గొంతుక వలె, గీతిక వలె
కిరణము వలె, వెలుగు వలె
హిరణ్యము వలె, జిలుగు వలె
శబ్దము వలె, అర్ధము వలె
పాదము వలె, పరుగు వలె
పున్నమి వలె, వెన్నెల వలె
నెలరాజు వలె, తారల వలె
శ్రామికుడి వలె, స్వేదము వలె
ప్రేమికుడి వలె, నిద్రలేమిల వలె
సంతసము వలె, సంబరము వలె
పండుగ వలె, సందడి వలె
భావన వలె, స్పందన వలె
భవనము వలె, పునాది వలె
మువ్వల వలె, సవ్వడి వలె
పువ్వుల వలె, సువాసన వలె
మేఘము వలె, మయూరము వలె
వసంతము వలె, కోకిల వలె
కీర్తన, నర్తనముల వలె
సంగీత, సాహిత్యముల వలె...

అపర రతీ మన్మథులై
అలిఖిత ప్రణయ రస కావ్యకర్తలై
ఆయురారోగ్యాలు మీ చిర నేస్తాలై
అష్టైశ్వర్యాలూ నిత్యం మీ అధీనమై
అద్వైతానికి కొత్త అర్థమై
ఆదర్శమవండి.... అనితర సాధ్యమవండి 

'వెన్న'ల కొండ మా యశోదా తనయుడు నంద కిషోర్


వెన్నెల కొండ సౌమ్యల వివాహ మహోత్సవ శుభ సమయాన

శుభాకాంక్షలతో

No comments: