Monday, December 29, 2014

'100% attendance' never my criterion for an 'ideal student'!

Photo courtesy: Metro India

A few months back, I accompanied my father to an ophthalmologist. Waiting for our turn to consult the doctor I noticed a girl around 10 to 12 years reading an English comic book. Almost spontaneously I called the girl, ‘Wow, Great!’

I also drew my father’s attention to it. I said, ‘Nana, see how studious the girl is, she is not wasting her time even while waiting for her turn to see the doctor.’ He was not moved at all! In fact, he said, “This is the state of our parenting, pathetic!” 

I wondered what was so pathetic about it. He was clear in his statement. He continued, “She can’t spend even half an hour talking to her parents or with the boy (probably her brother) who has been struggling to engage her in a conversation! And look at the mother; even she doesn't feel it as an opportunity to pass some of her wisdom to the young generation!”

“Today’s children are not taught how to mingle with others and on a large scale – with the society. That’s why they can’t spend time with their own kith and kin. They enjoy getting choked by their solitude,” saying this he stopped. I nodded in agreement.

Two days back when I read the story of a girl – Varsha – I felt like a déjà vu! The girl never missed a single day in school, college for 20 long years!  I thought it should have been 16 years going by Indian schooling system of 10+2+4.

Nevertheless, my instant response to the story was not one of awe or wonder but was ‘aww’ and ‘dismay.’ Not that I regard the achievement of the girl insignificant but I am worried that the sheer number of years not missing a class in the educational institutes should set a precedent! I am afraid that such self-imposed ‘discipline’ should not deprive the children the real pleasure of living life in all its hues!

As a teacher who had worked in some of the best schools in the city, I can say with all the confidence that ‘100% attendance’ was never my criterion for judging the brilliance in a student. Without sounding narcissistic, I can say that I have identified raw talent and rightly predicted, in most cases, that those learners will go places. Indeed they went places. And believe me, none, mark my words none of them were that ‘awfully’ regular to the school.

In fact there were several ‘false negatives!’ That is, I underestimated students who have been ‘childish’, ‘silly’, ‘amateurish’ and so on. But they made me eat the humble pie by shining brighter than their ‘sincere’, ‘sensible,’  ‘mature’ counterparts!

And please don’t take me wrong that I advocate absenteeism, indiscipline or some form of mild anarchism in schools! No teacher, past or present, would do that! Then what’s my point?

Movies are not the best guides for academic discipline but my mind goes to recollect a scene from ‘Rang De Basanti’ where ‘DJ’ (Aamir Khan) says that life after schooling is a different ball game altogether and more talented ‘DJs’ have failed to face it!

Students these days are not allowed to give vent to their feelings. The old ‘joint family’ system no longer practical, ‘nuclear families’ have become more a norm than an exception. The children do not get to share their feelings – joy or sadness, ecstasy or pain – with the loved ones. Nor are they exposed to understand the good, bad and ugly of the world around them.

In 16 years of the Varsha’ schooling, I am sure she either missed some of these occasions or was shielded from getting to know about them. I hope their parents are wise enough and found other ways and means to enlighten her on life!

But it cannot happen with every child. This is a fast paced life. Here your Facebook gives you hundreds of friends but none to fall back upon in times of distress! A child is made to study for hours together from morning till night but fails to assimilate any ‘lesson’ from it! Parents run from pillar to post to fend their families never realising that they are missing on the irrevocable present moment! You are a bundle of emotions but all momentary! Like the Hyderabadi roads that get inundated to even the slightest of the drizzle only to be emptied in a matter of hours.

So next time if some event – auspicious or inauspicious – happens in your life, let your child know it. Expose him or her to it. Tell him that life throws those sudden unexpected boulders or bouquets. Let them learn the ‘Sthithaprajnatha’ – equanimity – i.e. to take the gravest and happiest of things in their stride and move on with a sense positive attitude. Let each experience enrich, embolden and elevate them!


Sorry Varsha, I admire your persistence and unflinching commitment. No offence please, I cannot recommend this to any of my students, not certainly to my two-year-old daughter!  

Saturday, June 07, 2014

Current poilitcal situation in AP - the way forward (25/10/2011)

గత రెండు సంవత్సరాలుగా  ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణాలో సాగుతున్న ఉద్యమం, దానికి ప్రతిగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. సంక్షోభ నివారణకు, ప్రతిష్టంభన తొలగింపుకు రాజకీయ పార్టీల క్షమార్హం కాని నిర్లిప్తత, దాటవేత, నాన్చుడు ధోరణి, అశ్రద్ధ మొత్తం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పైనే ప్రజలకు నమ్మకం పోగొట్టేలా ఉన్నాయి. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ఏరాజకీయ పార్టీ కూడా రెండుప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే ఒక ఉమ్మడి, మధ్యే మార్గాన్ని ప్రతిపాదించి దానిపై విస్తృత స్థాయిలో అర్థవంతమైన చర్చలు జరిపి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనే ప్రయత్నం ఇప్పటికీ  చేయలేదు.

ఇకముందు చేస్తాయన్న సూచనలు కనిపించటం లేదు. ఒకే రాజకీయ పార్టీకి చెందిన భిన్న ప్రాంతాల నాయకులు ఒక అంశంపై  పరస్పర విరుద్ధమైన రాజకీయ ద్రోక్కోణాన్ని ప్రకటించటం, తమ సహచరులతో నిత్యం మాటల యుద్ధంజరుపుతుండడం స్వతంత్ర భారత చరిత్రలో బహుశా అత్యంత అరుదైన పరిణామం కావొచ్చు.

తెలంగాణా వాదానికి 60 ఏళ్ళ చరిత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు జరిగిన చరిత్రపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆ వాదనలను అంగీకరించినా, విభేదించినా 53 సంవత్సరాలు గడచినా  రెండు ప్రాంతాల మధ్య పరస్పర నమ్మకం, గౌరవం, తెలుగు భాషా వ్యవహర్తల మధ్య ఐక్యతసిద్ధించలేదన్నది నిర్వివాదాంశం.

చిదంబరం డిసెంబరు ౯ ప్రకటనను  తెలంగాణా వాదులు తొంభైయ్యవ దశకం నుండి ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతూ వస్తున్నచర్చల ప్రక్రియకు తార్కిక ముగింపుగానే భావించారు. స్తబ్దంగా ఉన్న తెలంగాణా రాష్ట్ర  డిమాండును మళ్ళీ రాజేసింది కాంగ్రెస్ (ఇరు ప్రాంతాల నాయకులు 'సమైక్యంగా' ) నాయకులేనన్నది నిజం. రాజకీయ స్వప్రయోజనాలకు తెలంగాణా అంశాన్ని వాడుకున్నదీ నిజం. ఆ సందర్భంలో ఇప్పుడు కరడుగట్టిన సమైక్య వాదులుగా రూపాంతరం చెందిన నాయకులెవ్వరూ అభ్యంతరాలు చేప్పలేదన్నదీ నిజం. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన సీమాంధ్ర సంపన్న,రాజకీయ వర్గాలకు మింగుడు పడలేదు. జన సామాన్యానికి కూడా ఇది అనూహ్యంగానే ఉండింది. నిజానికి 2001 నుండి తెలంగాణా అంశంపై మాటల గారడీ చేస్తూ వస్తున్న కాగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజల అభ్యంతరాలను, ఆందోళనలను, అనుమానాలను, అపోహలను తెలుసుకొని, వాటిని నివృత్తి చేసే దిశగా అడుగులు వేయవలసింది. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు.

అదే సమయంలో తెలంగాణా ప్రాంతంలో టీఆర్ఎస్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరింత విస్త్రుతమయ్యింది, ఉద్ధ్రుతమయ్యింది. సమాంతరంగా అదే కాలంలో హైదరాబాదు, పరిసర ప్రాంతాలకు సీమాంధ్ర నుంచి వలసలు ఎక్కువయ్యి వారికి ఈ ప్రాంతంతో ఆర్ధిక, మానసిక బంధం ఏర్పడింది. విచిత్రంగా కనిపించే ఈ వైరుధ్యం రెండు ప్రాంతాల మధ్య అగాధాన్ని సృష్టించింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉదాసీనత, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, సీమాంధ్ర ప్రజల, నాయకుల ఆర్థిక ప్రయోజనాల మధ్య జరుగుతూ వస్తున్న ప్రచ్చన్న యుద్ధం డిసెంబరు తొమ్మిది ప్రకటన తర్వాత బహిరంగ యుద్ధమే అయ్యింది.

ఈ ప్రకటనతో ఒక్కసారిగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా నిట్టనిలువున చీలిపోయాయి. తెలంగాణా అంశంపై చర్చకు కనీసం ఒకే వేదిక మీద కూర్చునే పరిస్థితులుకూడా లేకపోవడం ఈ చీలికకు అద్దం పడుతుంది. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండటం  అభిలషణీయం. కానీ ఈ ప్రజాస్వామ్య వాతావరణం ఆయా పార్టీలకు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు అవరోధమైతే అది ఆ స్ఫూర్తికే వ్యతిరేకం. ఇటువంటి సమయంలో ఒక దూరదృష్టితో కూడిన విశాల మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకత్వం లోటు కారణంగా రాష్ట్రం అక్షరాలా అగ్ని  గుండమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తన అస్పష్ట  పదాలు, వాక్యాలు, ప్రకటనల ముసుగులో ఎటువైపు మొగ్గడం తనకు లాభాదాయకమో అటు మొగ్గే ప్రయత్నాలు చేసింది. చేస్తోంది.

రాజకీయాలంటే క్రికెట్ ఆటలా కాదు. క్రికెట్లో మ్యాచ్ పూర్తయిన తర్వాత ఫలితం వస్తుంది. రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలను సమాయత్తపరచవలసి ఉంటుంది. కానీ నేడు తెలంగాణపై నిర్ణయం క్రికెట్ మ్యాచ్కంటే కూడా ఉత్కంఠ  రేకెత్తిస్తున్నది. క్రికెట్లో ఫలితమేమయినా అభిమానులు పెద్దగా చేయగలిగిందేమీ ఉండదు. అదేరాజకీయాల్లో తప్పుడు నిర్ణయాలకు ప్రజలు ప్రతిస్పందిస్తారు, నచ్చకపోతే ప్రతిఘటిస్తారు. కాంగ్రెస్ సాంకేతిక కారణాలు చూపి తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసోకోవచ్చు. కాని ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో తెలంగాణా భౌగోళిక పటంలో కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం భస్మాసుర హస్తంలాఆ పార్టీని వెన్నాడుతోంది.

తెలుగు దేశం పార్టీకి ఆ వెసులుబాటు కూడా లేదు. ఎందుకంటే  ౨౦౦౯ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ సుముఖతను వ్యక్తం చేస్తూ అధికారంలోకి వచ్చాక దానికి అవసరమయ్యే అన్ని రాజకీయ, న్యాయ సంబంధ ప్రక్రియలను ప్రారంభిస్తామని ఆ పార్టీ విస్పష్టంగా ప్రకటించింది. ఓ రకంగా తెలుగుదేశం ఈ మానిఫెస్టో కాంగ్రెస్ డిసెంబరు తొమ్మిది ప్రకటనలాంటిదే.

అయితేరెండు పార్టీలూ తెలంగాణా విషయంలో మాట తప్పాయి. రెండు కళ్ళ సిద్ధాంతం, తటస్థ వైఖరి అని  టీడీపీ, విస్తృత స్థాయి చర్చలు, ఏకాభిప్రాయం పేరిట కాంగ్రెస్ ఒక అనైతిక రాజకీయ ఒరవడిని మొదలుపెట్టాయి. ఎందుకంటే తెలంగాణకు  అనుకూలమని చెప్పిన పార్టీలు మరో ప్రాంత ప్రజలు అందుకు ఒప్పుకోవడంలేదు  అని చెప్పి తటస్థ వైఖరి పేరుతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం ఇక్కడి ప్రజలను ఘోరంగా అవమానించడమే, మోసగించడమే! డిసెంబరు 9 ప్రకటనకు రెండ్రోజుల ముందు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒక్క సిపీఎం తప్పితే అన్ని పార్టీలు తెలంగాణా ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. ఎంఐఎం తన అభిప్రాయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తానన్నది. ఈ నేపథ్యంలో డిసెంబరు తరవాత ఏ చర్చలు, అభిప్రాయ సేకరణ జరిగినా అవి ఈ సూత్రప్రాయ తెలంగాణా అనుకూల వైఖరికి కొనసాగింపుగానే ఉండాల్సింది.

అది జరగలేదు. పోనీ తెలంగాణా ప్రజలనయినా సమైక్య రాష్ట్రం కొనసాగడం వల్ల కలిగే ఉమ్మడి ప్రయోజనాలను వివరించడం ద్వారా ఒప్పించవలసింది. అదీ జరగలేదు. ఆ పరిస్థితీ కనిపించడం లేదు. గడచిన రెండు సంవత్సరాలలో ఏ ఒక్క నాయకుడూ తెలంగాణాలో సమైక్యవాదం వినిపించే సాహసం చేయలేదు. సీమాంధ్రలో కొంతవరకైనా రాష్ట్ర విభజన వాదం వినబడుతోంది. తెలంగాణకు అనుకూలమే అని ప్రకటించినా ఆ ప్రాంత నాయకులు గానీ, చంద్రబాబు నాయుడు గానీ ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులదీ అదే పరిస్థితి. కొద్దో గొప్పో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా, డిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ మేరకు అక్కడి ప్రజల విశ్వసనీయత పొందగలిగారు. ఇంతటి సంక్షిభిత, కల్లోల సమయంలో రాష్ట్ర ఏర్పాటు జరిగి యాభై ఐదు సంవత్సరాలు పూర్తయినా అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన ఒక్క నాయకుడూ ఎదగలేక పోవడం బట్టి రాష్ట్రం ఏ పాటి సమైక్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం - ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ - ఏ నిర్ణయాన్నీ ప్రకటించకుండా రెండు ప్రాంతాలనూ నిరవధిక  అస్థిరతలోకి  నెట్టి వేసింది. తెలంగాణా ప్రాంతం దీనివల్ల మరింత ఎక్కువగా నష్టపోతోంది. హైదారబాదులోని సీమాంద్రులలో ఒకవైపు అభద్రతభావం పెరుగుతుంటే, తెలంగాణా ఉద్యమకారులలో శాంతియుత మార్గాలేవీ ఫలితమివ్వకపోవడంతో రోజు రోజుకీ అసహనం పెరుగుతోంది.  పర్యవసానంగా రాజకీయ వ్యవస్థ బాధ్యతలనూ పోలీసులే తీసుకొని అప్రకటిత ఆత్యయిక స్థితిని నెలకొల్పారు. రాజకీయ ప్రక్రియ ద్వారా, రాజకీయ పార్టీల తోడ్పాటుతో పరిష్కారమవ్వాల్సిన సమస్య ఇపుడొక శాంతి భద్రతల సమస్యగా చిత్రించబడుతోంది. ఈ పరిస్థితులు తెలంగాణా ప్రజల్లో రాజ్య వ్యతిరేక భావనను మరింత పెంచి తీవ్రవాద పునరుత్థానానికి బీజాలు  వేసే ప్రమాదం ఉంది. అట్లే, సీమాంధ్ర ప్రజలు కూడా తెలంగాణాలో నిత్యం ఒక అస్థిరత, అభద్రతాపూర్వక వాతావరణంలో గడపాల్సి వస్తోంది.


అందుకే కాంగ్రెస్ ఈ అస్థిరతకు, ప్రతిష్టంభనకు ముగింపు పలకాలి. సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన కదలిక మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. 'కాల పరిమితి చెప్పలేం', 'చర్చలు కొనసాగుతున్నాయి', 'సుదీర్ఘ కాలం కొనసాగుతున్నఉద్యమం','అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం అన్వేషిస్తున్నాం'  అనే మాటలు చర్విత చర్వణంగా ఆ పార్టీ పెద్దల నుండి వస్తున్నాయి. సకల జనుల సమ్మె వంటి విస్తృత ప్రజా మద్దతు, భాగస్వామ్యం ఉన్న ఉద్ధృత ఉద్యమానికి ఇంత నిర్లక్ష్యపూరిత  ప్రతిస్పందనకు కారణం అన్ని పార్టీలూ ప్రజల సమగ్ర, దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తమ రాజకీయ స్వప్రయోజనాలకే పెద్దపీట వెయ్యడమే. ఈ వైఖరి వల్ల ప్రజలు తమ ఆకాంక్షల వ్యక్తీకరణకు ప్రజాస్వామ్య, శాంతియుత మార్గాల పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.అట్లే పాలకులలో ప్రజా ఉద్యమాలను అణచివేత ద్వారా ఎదుర్కోవచ్చనే ఒక అప్రజాస్వామిక ధోరణీ పెరుగుతుంది. ఇది సామాజిక అశాంతికి దారి తీస్తుంది.

కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినత వరకు రెండు అతి పెద్ద సవాళ్లున్నాయి. ఒకటి జగన్ అంశం అయితే, రెండవది తెలంగాణా అంశం. మొదటి అంశం వ్యక్తిగత ప్రయోజనాల నుంచి పుట్టి ప్రజా సమూహంలోకి వెళితే రెండవ అంశం ప్రజా సమూహం ఆకాంక్ష నుంచి పుట్టి వ్యక్తిగత ప్రయోజనాలకి దారి తీసింది. ఈ రెండిట్లో ఏదో ఒక అంశం 'సహజ మరణం' చెందుతుందని కాంగ్రెస్ ఆశించింది. ఎదురుచూసింది. అయితే ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. తెలంగాణా అంశంలో అనేక చిక్కులు ఉన్నందున సమాంతరంగా జగన్ అంశం ఆ పార్టీ దృష్టి పెట్టింది. జగన్ పై ఒత్తిడి పెంచి ఆ పార్టీని తిరిగి కాగ్రెస్ అనుకూల పక్షం గానో, లేక పూర్తిగా విలీనం చేసుకోవడం ద్వారానో ఈ అంశం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. నూటా డెబ్భై అయిదు అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలున్న సీమాంధ్ర ప్రాంతంలో తమ రాజకీయ ప్రయోజనాలను కాంగ్రెస్ విస్మరించడం ఆత్మహత్యా సదృశం. అందుకే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం ద్వారా కొంతవరకు మెరుగైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జగన్ అంశం కూడా ఒక కొలిక్కి వస్తే మరింత బలపడే అవకాశం ఉంటుంది. జగన్ అంశం తేలకుండా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే నెమ్మదించిన జగన్ దూకుడు మళ్ళీ మొదలవుతుంది. సిబిఐ సోదాలు, అనంతపురం, కర్నూలుతో కలిపి 'రాయల తెలంగాణా' ఏర్పాటు ప్రతిపాదన  వెనక జగన్కున్న ప్రజాదరణను, ప్రజామోదాన్ని దెబ్బకొట్టాలన్న వ్యూహం ఉందనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే జాతీయ  స్థాయిలో ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ లాగా కాంగ్రెస్కు మిత్రపక్షంగా ఉంటాం కానీ బీజేపీకి దగ్గరయ్యే ఆలోచన లేదని జగన్ ప్రకటించడం కాంగ్రెస్కు సంతృప్తినిచ్చే విషయం. అయితే తెలంగాణా విషయంలో కాంగ్రెస్ తీసుకొనే వైఖరిని జగన్ పూర్తిగా సమర్థించే పరిస్థితి కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. ఇవన్నీ జరిగినా సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందిస్తారో చెప్పలేం.


అయితే అద్వానీ 'జన చేతనా యాత్ర'తో తెలంగాణా అంశానికి జాతీయస్థాయిలో మరింత ప్రాముఖ్యతను తెచ్చారు. కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతిస్తామని, లేదంటే అధికారంలోకి వచ్చాక తామే బిల్లు ప్రవేశపెడతామని బీజేపీ విస్పష్టంగా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ను ఖచ్చితంగా ఇరకాటంలో పెడుతుంది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా ౨౦౧౪ లోనో లేక అంతకుముందో జరిగే ఎన్నికల్లో బీజేపీ, టీ ఆర్ ఎస్ లాంటి పార్టీలు  తెలంగాణా వాదంతో బరిలోకి దిగుతాయి. అంటే ఇప్పుడప్పుడే ఈ అంశం ముగిసే అవకాశం కన్పించడం లేదు. దీనికి తోడు, సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే తెలంగాణపై ఘాటుగా మాట్లాడుతున్నారు. జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, ౧౦ మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించి ఈ రోజు వరకూకట్టుబడి ఉన్నారు. సకల జనుల సమ్మె ముగిసినా మరో రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని కొదండరాం చెబుతున్నారు. టీ ఆర్ ఎస్ కూడా నిరాహార దీక్షలతో నవంబరు ఒకటి నుండి మళ్ళీ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రకటించింది. తెలంగాణా మార్చ్కు ఏర్పాట్లు  జరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా అది ఏ పరిణామాలకు దారి తీస్తుందోనని అందరిలో ఒక ఆందోళన సహజంగానే ఉంది.


ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా బతకాలంటే,ఈ రాష్ట్రంలో మళ్ళీ శాంతియుత వాతావరణం నెలకొనాలంటే తెలంగాణకు అనుకూల వైఖరిని తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే ఆ పార్టీ పరిస్థితి రెంటి చెడ్డ రేవడవుతుంది. రెండు ప్రాంతాల్లో నష్టపోయే ప్రమాదముంది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయ సంబంధ మైన వివాదాలను సుప్రీం కోర్టు ఎలా పరిష్కరిస్తుందో, రెండు ప్రాంతాల మధ్య రాజకీయ వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఇది రాజ్యాంగ నిర్దేశిత కర్తవ్యం. కాని ఈ అంశాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకోవాలని చిదంబరం వంటి పెద్దలు చెప్పడం అనైతికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఎందుకంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం గురించి ప్రస్తావించదు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని మాత్రం రాష్ట్రపతి నిర్ణయించిన సమయంలో వ్యక్తపరచాలి. ఆ అభిప్రాయాన్ని తిరస్కరించే అధికారం కేంద్రానికి ఉంది. అందుకు భిన్నంగా సమస్య పరిష్కార బాధ్యతను రాష్ట్రంలోని పార్టీలు, ప్రజలపైకి నెట్టడం వలన అపనమ్మకం, ఉద్వేగ పూరిత వ్యాఖ్యలు, అభద్రతా భావం, అస్థిరత రాజ్యమేలుతున్నాయి. ఈ వాతావరణం రెండు ప్రాంతాల్లో  తీవ్రమైనవాదాలకు ఊతమిస్తాయి. ప్రజల మధ్య పూడ్చలేని అగాధాన్ని ఏర్పరుస్తాయి.


అయితే, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇంకా సమస్య శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇంత చీలిక వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని యధాతథ స్థితిలో ఉంచడం సాధ్యం కాదని శ్రీ కృష్ణ కమిటీ కూడా అభిప్రాయపడింది. అయితే కమిటీ ప్రతిపాదించిన రీజినల్ కమిటీ మార్గం సమస్యను పరిష్కరించే అవకాశం లేదు. అది పనిచేయని ఔషధాన్ని కాలం చెల్లిన తర్వాత మళ్ళీ ప్రయోగించడం అవుతుంది. రెండవ రాష్ట్రాల పునర్వ్యవస్తీకృత సంఘం (SRC), హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో వ్యతిరేకత వుంది. ఈపరిస్థితులలో కాంగ్రెస్ దశాబ్ద కాలంగా అస్పష్టంగానైనా ప్రకటిస్తూ వస్తున్నతెలంగాణా అనుకూల వైఖరికి తుది రూపం ఇవ్వటమే సమస్యకు శాశ్వత పరిష్కారమవుతుంది.

రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపి ఆ పరిష్కారం పరిధిలో సీమాంధ్ర ప్రాంత న్యాయబద్ధమైన, సహేతుకమైన ఆందోళనలను, అభ్యంతరాలను, అనుమానాలను గుర్తించి, గౌరవించి వారిహక్కులను కాపాడే దిశగా స్పష్టమైన హామీలతో కూడిన ప్రకటన కేంద్రం చెయ్యాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన బలహీన వర్గాలకు రాజ్యాధికారం, వనరుల పంపిణీ, వినియోగంలో సమానత్వం, వికేంద్రీకరణ వలన పారదర్శక, వేగవంతమైన పాలనా, కొత్త రాజధాని కేంద్రంగా జరిగే సత్వర ఆర్థికాభివృద్ధి చిన్న రాష్ట్రాల వల్ల సాధ్యమవుతుందన్న అవగాహన పునాదిగా కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.

Tuesday, August 23, 2011

తెలంగాణపై విషం చిమ్మిన 'కందిరీగ'

విష  నాగు... మరో విష నాగు... తెలంగాణ సమాజాన్ని, మానవ సంబంధాల్ని, సంస్కృతిని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షనీ అనహేళన  చేస్తూ విషం చిమ్మిన సినీ విష నాగు. అది కందిరీగ రూపంలో ముందుకొచ్చింది. 55 ఏళ్ళ మొదనష్టపు సమైక్య రాష్ట్రంలో ఎద నిండా గాయాలూ, గుండె కోతలూ  తెలంగాణకు కొత్త కాకపోయినా ఆంధ్రా ఆర్ధిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఈ ప్రాంతం ప్రశ్నిస్తోన్న, ప్రతిఘటిస్తోన్న తరుణంలో ఆ విషనాగు 'కందిరీగ' వేషం కట్టి తెలంగాణలో తిరుగుతోంది . అది ఆంధ్రా జాత్యాభిజాత్యానికి, అహంకారానికి తిరుగులేని ఉదాహరణ, ప్రతినిధి. అయినా ఈ ఘోర అవమానాన్ని గుర్తించలేని, గర్హించలేని అమాయకత్వం మనది. 

కథ లోకి పోతే, కథానాయకుడి ఊరు, ఇంకెక్కడా అదే ఆంధ్రా, అదే అనకాపల్లి. తల్లితండ్రులు 23 ఏళ్ళ వయసొచ్చినా తనకు పెళ్లి చేయడంలేదని ఆ విషయంతో ఎ విధంగానూ సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి పీటల మీదినించి 'లేపుకొస్తాడు'. ఇది 'హీరో' పరిచయపు సన్నివేశం. ఆ తర్వాత డిగ్రీ కూడా పాసవని వాణ్ని పెళ్లి చేసుకోనని తన మరదలు చీదరించుకోవడంతో రేషంతో శపథం చేసి ట్రైనులో హైదరాబాదు బయలుదేరతాడు. అదే ట్రైనులో, అదే అనకాపల్లిలో తెలంగాణా యాసలో మాట్లాడే ఈవ్ టీజర్స్ బారి నుండి అమ్మాయిల్ని రక్షించి, ఆ రౌడీలకు 'అమ్మాయిల్ని అల్లరి చెయ్యాలి కాని, అల్లరిపాలు చెయ్యకూడదు' అని గీతోపదేశం చేస్తాడు. అంతే! ఆ  'హీరోచిత' ఫైటింగుకు, తర్వాతి ప్రవచనానికి అమ్మాయిలంతా ఫ్లాట్! మన ఖర్మ కాలి అలా 'పడిపోయిన' వారిలో మన తెలంగాణకు, వరంగల్లుకు చెందిన అమ్మాయీ ఉంటుంది.

హైదరాబాదు చేరుకున్న హీరో గారు(శీను) కాలేజీలో చేరతారు. అక్కడ మొదటి చూపులోనే శృతి  అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. విశేషమేమిటంటే ఈమె తండ్రి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగి. ఆ ప్రస్తావన ఎందుకో తర్వాత చెప్తాను. ఇహ షరా మామూలుగానే విలన్లూ, ఫైటింగులూ ! మొత్తానికి హీరో తన చచ్చు, పుచ్చు 'అతి తెలివితో' తన ప్రేయసిని రక్షించుకుంటాడు. సుఖాంతమయ్యిందనుకున్న కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటికి ఒక గంటే అయ్యింది మరి! శ్రుతిని వరంగల్ రాజన్నకు చెందిన మనుషులు కిడ్నాప్ చేస్తారు. అనకాపల్లిలో హీరో గారి వీరోచిత యుద్ధ ప్రావిణ్యానికి, ప్రవచనానికి 'పడిపోయిన' అమ్మాయిల్లో  ఈ రాజన్న కూతురు ఒకరు. ఆమె శీనుగాడిని తప్ప మరెవర్నీ పెళ్ళిచేసుకోనని జిద్దుకు  కూర్చుంటుంది. శ్రుతిని కిడ్నాప్ చేస్తే, ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టి శీను కూడా వరంగల్లుకు వస్తాడు. అదీ లింకు. అదే జరుగుతుంది. కాకతీయ తోరణమున్న ఒక పెద్ద భవనంలో రాజన్న మందీ మార్బలంతో ఉంటాడు. గమ్మత్తేమిటంటే  'రాయలసీమ'  'మర్యాద రామన్న' సినిమాను చిత్రీకరించిన ఇంటి లోనే ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదేం అపరాధం కాదు కానీ, రాయలసీమ ప్రాంత గృహ నిర్మాణ పధ్ధతి ప్రతిబింబించేలా సెట్ వేసుకున్నామని చెప్పుకున్న ఇంట్లో తెలంగాణ ప్రాంతమని చెప్పి షూట్ చేయడాన్ని బట్టి దర్శకుడికి టేస్ట్, శ్రద్ధ, నిజాయితీ వంటివేవీ లేవని రుజువవుతుంది. మొత్తానికి ఒక తోరణాన్ని ఇంటి ముందర పెట్టి వరంగల్ అనిపించారు, కథ నడిపించారు.

ఇహ ఇక్కడ మొదలౌతుంది విష నాగు విశ్వరూపం! సారీ! అదే 'కందిరీగ' విశ్వరూపం! మొట్ట మొదటి సీన్ నుంచే  రాజన్న కూతురిని (సంధ్య) ఒక తెలివితక్కువదానిలా చూపిస్తాడు దర్శకుడు (అమాయకత్వానికి, తెలివితక్కువతనానికి చాలా తేడా ఉంది!).  హీరో గారు కూడా 'తింగరబుచ్చి', 'ఇంత వయోలెంట్ గా ఎలా పుట్టావే!?' అని అనడం ద్వారా, ఇంకా అసహనం, అవహేళన కూడిన వాచికం, అభినయంతో ఈ విషయంలో మనకేమైనా అనుమానలుంటే పూర్తిగా  నివృత్తి చేస్తాడు. ఇక సంధ్యకు తనపై ఉన్నది ప్రేమ కాదనీ, ఇష్టం మాత్రమేనని, నిజమైన ప్రేమ కలిగితే గుండె గంటలు మోగుతాయని జ్ఞానోదయం ప్రసాదిస్తాడు. అయితే తర్వాతి సన్నివేశంలో హీరోకి బద్ద శత్రువైన భవానీని అనుకోకుండా గుద్దుకుంటుంది సంధ్య. భవానీ సంధ్యను కింద పడకుండా పట్టుకుంటాడు. చూపులు కలుస్తాయి. అదే సమయంలో ఇంటి బయట ఒక ఎద్దు మెడలో కట్టిన గంటలు మోగుతాయి.  'గంట మోగింది' కాబట్టి అదే ప్రేమ అనుకునేంత ఎడ్డిదానిగా (తెలంగాణా, వరంగల్ పిల్ల కదా!) చూపిస్తాడు దర్శకుడు. దార్శనికుడు మరి! ఇది చాలదన్నట్టు చివర్లో సంధ్యకు నత్తి అనే మరో ఆభరణం తగిలిస్తాడు. ఎందుకంటే విలన్ భవానీకి కూడా నత్తి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సరిజోడని వారి అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే రాజన్న, భవానీ ఇద్దరూ గూండాలే కదా!  మరీ చిల్లర మల్లర గాడైన శీనుకి, 'ఆంధ్రా' బ్యాంకు ఉద్యోగి కూతురెందుకో? 'రాయలసీమ మురిసిపడేలా' రామినీడు కూతురు 'తెలుగమ్మాయి' అయినట్టు, 'తెలంగాణ' మురిసిపడేలా రాజన్న కూతురు ఎందుకు 'తెలుగమ్మాయి' కాలేకపోయింది? 'తెలివితక్కువదెందుకయ్యింది'? ఎందుకంటే ఇది 'సమైక్య' రాష్ట్రం కాబట్టి!
  
'ఇల్లే ఇంత అందంగా ఉంటే బావగారెంత అందంగా ఉంటారో' అని ముందు చంద్ర మోహన్ పాత్రతో అనిపించి వెంటనే మర్డర్ చేసిన కత్తి రక్తంతో కాబోయే వియ్యంకుడికి రాజన్నచే తిలకం దిద్దిస్తాడు దర్శకుడు.  రాజన్న పాత్రను జయప్రకాశ్ వేసారు. అలవాటులో పొరపాటుగా ఇది రాయలసీమ సినిమా అనుకున్నాడేమో పాపం దర్శకుడు! ఒక అమర్యాదస్తుడిగా, సంస్కారంలేని వ్యక్తిగా రాజన్నను చిత్రిస్తాడు. అక్కడితో అయిపోదు. కాబోయే మామగారిని సంధ్యకు పరిచయం చేస్తాడు రాజన్న. అదేమీ పట్టించుకోకుండా, కనీసం పలకరించకుండా కేబులోన్ని 'బొక్కల నూకు' మంటుంది సంధ్య. తెలంగాణా అమ్మాయిని మర్యాద తెలిసిన వ్యక్తిగా చూపించడం ఇష్టం లేదు కావొచ్చు దర్శకుడికి.  ఇది టూ మచ్ అంటారా? వెంటనే తండ్రి నమస్కరించమంటే సంధ్య ఏమంటుందో చూడండి. ' చల్... గా పొట్టి సాలెగాడు... గానికి నేను మొక్కుడేంది? నేన్మొక్కా..' దానికి రాజన్న 'అర్రే.. గాయన నీ మామ... మంచిగుండది...' అంటాడు.  అయితే తర్వాత సన్నివేశంతో లిబరల్స్ ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా విషయం అర్థం అయ్యేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. శ్రుతిని తన తండ్రికి పరిచయం చేస్తాడు శీను. వెంటనే శృతి పద్ధతిగా కాబోయే మామకి నమస్కరిస్తుంది. ఎంతయినా 'ఆంధ్రా' బ్యాంకు ఉద్యోగి కూతురు కదా! వినయం, విధేయత, సంస్కారం అన్నీ ఆంధ్రా వారి గుత్త సోత్తాయే!        
   
ఈ సినిమాలో తెలంగాణ ప్రాంత వేషధారణ చేసిన వారు వింత వింతగా కన్పిస్తుంటారు. ఉదాహరణకు రాజన్న శత్రువు ఒకడు అడుగు స్థలం కోసం 500 ఎకరాల భూమిని అమ్ముకుంటాడు. పరువుకోసం అన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అంత ఎర్రోడు అని అయ్యవారి అభిప్రాయం. వేల ఎకరాల భూములను రియల్ ఎస్టేట్ గద్దలనుండి ఎలా కాపడుకోవాలో తెలంగాణ వారికి తెలియకపోవడం నిజంగా 'ట్రాజిడీయే'! దాన్ని కూడా కామెడీ చేయగల ప్రజ్ఞా పాటవాలు కేవలం ఆంధ్రా వారికే ఉన్నాయి. అట్లే ఈ పాత్రధారులు మాట్లేడే యాస కూడా చాలా చికాకు పెడుతుంది. సంధ్య ఎన్నిసార్లు 'చల్' అన్నదో, రాజన్న ఎన్నిసార్లు 'తోడ్కలు తీస్తా' నన్నాడో లెక్క పెట్టలేకపోయాను. అసలు ఇట్లాంటి యాస వరంగల్ జిల్లాలో ఎక్కడ, ఎవరు మాట్లాడతారో చెబితే దర్శక నిర్మాతలకు పాదాభివందనం చెసుకుంటాను. తెలంగాణ యాసలను న్యూనపరిచే, అవహేళన చేసే, కింఛపరిచే ఇలాంటి సన్నివేశాలను అనేక సినిమాలలో గత 55 సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం? 


ఇప్పటి వరకూ తెలంగాణను ప్రతీకాత్మకంగా ఎట్లా అవమానించాడో చూసాం. ఇది ఒక ఎత్తయితే ఒక పాటలో తెలంగాణా ఉద్యమాన్నీ, తెలంగాణా వాదుల్నీ, తెలంగాణా ఉద్యమకారుల్నీ చులకన చేయటం మరో ఎత్తు! 'ప్రేమే పోయినాదిలే' పాటలో పూర్తిగా దిగాజారుతాడు దర్శకుడు, పాట రచయిత. 

'... అల్లుడే రెడీ అంటే తెలంగాణ తెప్పించేస్తా...' అంటాడు రాజన్న. అదేదో ఆ అల్లుడుగారి, ఈ మామగారి ప్రైవేటు వ్యవహారమన్నట్టు! ఈ లైన్ తర్వాత ఒక్కసారి స్క్రీన్ ఫ్రీజ్ అవుతుంది. అందరూ ఆముదం తాగిన మొహాలు పెడతారు. తర్వాత రాజన్న బామ్మర్ది  ' మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంటా...' అని అందుకుంటాడు. అంటే తెలంగాణాని కోరుకోకపోవటం 'మంచిగ ఉండటం', కోరుకోవటం 'మెంటల్' గా అయిపోవటం! ఈ సదరు బామ్మర్ది  ఇంటలిజెన్స్ డిపార్టుమెంటులో పనిచేయటం యాదృచ్చికమేనా? 

దీంతో ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న 'బెనిఫిట్ అఫ్ డౌట్'కు  ఈ సినిమా పూర్తిగా అనర్హమౌతుంది! తెలంగాణ వాడి గుండె మండుతుంది, రక్తం మసలుతుంది. సమైక్యవాదం ఒక ఫార్సు కాకపోతే ఈ పాటికే సున్నితమైన ప్రస్తుత సందర్భంలో ఇలాంటి రెచ్చగొట్టే సినిమా తీసినందుకు సీమంధ్ర ప్రాంత ప్రజలు ఆ దర్శక, నిర్మాతలను నిలదీయాలి, ప్రశ్నించాలి. కాని అది జరగలేదు, జరగదు! ఇప్పటికే 'అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందాం' నించి 'ప్రాంతాలుగా విడిపోదాం ప్రజలుగా కలిసుందాం' వరకు వచ్చింది పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు అనివార్యం, తథ్యం! అయితే తెలుగువారి మధ్య ఈ విభజన భౌగోళికమే కాని మానసికం  కారాదన్నా, పరస్పర అభిమానం, గౌరవం కొనసాగాలన్నా  'కందిరీగ' లాంటి సినిమాలను సీమంధ్ర ప్రజలు తిరస్కరించాలి. 'కందిరీగ' రూపంలోని ఈ విషనాగు సీమంధ్రలోని కోంతమంది   స్వార్థపరుల,  పెట్టుబడివర్గాల, ఆభిజాత్యం, ఆధిపత్యం,  అహంకారం, ప్రాంతీయతత్త్వాలకు పుట్టిన విష పుత్రిక. వీటిని సమూలంగా నాశనం చేస్తేనే తెలుగువారి మధ్య భావ ఐక్యత సాధ్యం! చేయీ చేయీ కలపటానికి  తెలంగాణా ఎప్పుడూ సగానికంటే ఎక్కువ దూరం నడవటానికి సిద్ధమే! 




Monday, July 04, 2011

Chidambaram's apathy

Yesterday's press conference of Mr.Chidambaram. My reply in bold text.
Q: Congress MLAs and MPs from Telangana tendered their resignations. Do you feel that the situation is really out of control now?

A: I dont think there's anything that's gone out of control. The MPs and MLAs have forewarned us that they are obliged to tender their resignations on the fourth of July. This has not come as a surprise for us. Meanwhile the party's general secretary in-charge is talking to the Telangana MLAs and MPs... the MPs are here and the MLAs are in Hyderabad. We're in touch with them. I don't think we need to get alarmed about this development. They have given expression to a view that they hold very strongly... but I think we'll be able to persuade them to be patient and to allow the consultation process to continue.

Me: When was the situation under control, to now go out of control? So the'out of control' situation is not gone out of control.  If you look at it, the statement also is an indication that the Congress High Command bothers least for Telangana leaders leave alone Telangana people. 'Chiddu' says that they were forewarned by the T-leaders and they were obliged to express their views. But they cared a damn for it and sent Mr. Azad to prepare them for the ensuing Council - a reinvention of TRC of 1956.

Q: Mr. Chidambaram, the congress MLAs and MPs are quoting your 9th December statement and asking why the government is going back on its own word? That's why they are giving the resignations.

A: For the last time, let me say the 9th December is not an individual's statement. It was a statement made on behalf of a Governement. But, on 23rd Decemeber it had issued another statement telling why it had to put the 9th December statement on hold and start a process of consultation. So, whenever you refer to the 9th December statement kindly also refer to the Dec 23 statement.

Me: You made equal a fifteen day anti-Telangana agitation to a 60 year old Telangana Statehood movement. All familiar story for us Mr. Home Minister. Andhras always weigh more in your justice balance than us, Mr. Advocate.

Q: You said your party in-charge is in a dialogue with resigned representatives. Representatives from TDP also resigned. How do you deal with them? You promised of another all-party meeting six months ago. How long will it take to conduct that meeting?

A: Well, I can not comment on the resignation of an MLA belonging to TDP party. I don't think any MLA should resign. But that's for the leader of the TDP to deal with that. Yes. We'll hold an all-party meeting. At least two parties which are not yet ready with their final views. Once I get the indication that they are ready to give their final view, immediately the meeting will be called.

Me: I think you were addressing the press as the Home Minister of the country and not as a Congress spokesperson. The TDP leader doesn't need any advice from you as how to control their MLAs. He is more than a match for you Mr. Minister. It was a crisis created by the Central government and the T-TDP MLAs have resigned because you did a volte face with your decision on 23rd December. And you owe an explanation.

Q: WHat is the Central government's view on the Telangana issue. You have received Srikrishna Committee report. What's your action on that?

A: The central government's view will be made known after the consultation process is over.WE have to bring everybody on board. There are strong views of a large number of people. We're trying to work out a consensus. If I had the central government's view today, I'd have told that before. right? The central government is yet to take a final decision.

Me: Strong views of who Mr. Minister? Consensus on what? Consensus only on creation of seperate State? Should it be ok if there was no consensus for the Andhra Pradesh to continue?

Q: Then, how do you assuage the feelings of Telangana representatives?

A: By talking to them.

Me: 'Tall talk' really!

Q: But you have been talking to them for a long time, and that's why they resorted to these resignations.

A: we'll continue to talk to them until a consensus emerges.

Me: No time is too long for you 'Kumbhakarnas'.

Q: (in Hindi) Mr. Home Minister, in the name of consultations you can not take very long time. There should be a deadline to it. More than a year has passed. They say they can not wait for more time.

A: I understand, I understatnd their impatience. But these are complex issues. We'll try to expedite the consultation process. We'll try to take a final call. But these are extremely sensitive and complex issues. Therefore one has to have this understanding and patience, especially the media.

Me: We understood that you didn't understand the question Mr.Chidambaram.

Q: But, your party is famous for resolving complex issues.

A: (Kapil Sibal) We accept that compliment.

(Chidambaram) That's why they vote us back to power.

Me: Oh, you understood it that way, Mr. Sibal? You see a compliment in this?

Q: But Telangana people are suffering..

A: We'll talk to them... repeats

Me: You talk more on talking rather than actually 'talking', Mr. Chidambaram!

Q: There are 80 companies of forces and majority of them in Telangana. So there's a feeling that the centre is not going to implement its promise. And that's why all these MLAs and MPs are resinging.
 A: That's your conclusion. As I said the Governement has not yet taken a view.

Me: If only we knew your conclusion could we put a lid on our thoughts, Your Highness!

Q: Are you pulling these MLAs and MPs not to precipitate a crisis?

A: Yes, the general secretary in-charge and other leaders are talking to these MPs, MLAs and MLCs and let's wait for the outcome.

Me: Was that pulling or bullying, Mr. Minister?

Saturday, July 02, 2011

Telangana 'Mir Jafars'!!

History repeats itself! Because Humans reproduce themselves!! Following the Telangana's unprecedented struggle for creation of a new State for the region invariably reminds us of several epoch-making events of the History. The English East India Company - a trading company at the outset could later rule the country for 2 centuriess because of traitorous Indians siding with them at the very critical moments. The Battle of Plassey, undoubtedly the decisive battle that paved the way for British rule in India is a case in point.




The EIC, initially was interested in getting trade concessions from the Emperors of India and Nawabs of Bengal. They got the privileges in the form of duty-free trade by means of  dastaks. Dastaks are like passes which will be given to the Company. The passes were not to be used by the officials for their private trade. However, the greedy Company officials started misusing the passes and even started selling them to other Indian traders thereby depriving the Indian rulers huge tax money. Worse still, they started levying exorbitant taxes on Indian goods and Indian merchants. However, Bengal with a streak of able and self-respecting rulers  did not tolerate this. Siraj-ud-daula, the young Bengal ruler attacked the British cantonments and factories and made them to flee to an island - Fulta island - in the Bay of Bengal. The Young Nawab was amateurish in celebrating the victory while the cunning British were cooking the conspiracies from the sea. The British realized that they needed a puppet as the Nawab for their interests to be served unhindered. 

Robert Clive who fought battles against the French successfully was deputed to fight the young Nawab - Siraj-ud-daula. Clive used treachery as his main weapon. He induced Mir Jafar - a commander in Siraj's army with the Throne of Bengal if he colludes with the British. Mir Jafar along with some other traitors sided with the British and turned the guns against their own Bengal Army. The Battle of Plassey was no exhibition of strength but of treachery, to state the obvious fact. The victorious British instated Mir Jafar as the Nawab. The puppet Nawab reciprocated with humongous amount of money as war indemnity and bribes to the British officials. But Mir Jafar soon realised his folly and knew that the thirst for the money and presents of the British can never be quenched. When Mir Jafar started to question this, he was removed from the office citing incompetence as reason. He was replaced by another puppet ruler Mir Qasim. Unlike Mir Jafar, Qasim was quick to reassert the independence of the Nawab much to the displeasure of the British. Then in Battle of Buxar the Nawab was defeated to be reinstated by Mir Jafar again. Followed that was history - that looked 'an eternal gloom for India '!  


  

Though separated by centuries in time, the Telangana political leaders of the day are playing Mir Jafar of that age. When the shameless Seemandhra leaders took to coercion and did a volte face within hours of the Decemer 9th  statement from the Governement of India, the Telangana leaders withdrew from performing their Dhrama. Worse still, some of them became hand-in-glove with the Seemandhra leadership targeting those who are relentless in their fight for the Statehood. The Seemandhra leaders' colonial doctrine of 'divide and rule' was put in place and these leaders are more than willing to play Mir Jafar. The subservient Telangana TDP leaders' attacks on people questioning their party's stand on the issue and the chameleon Babu's veiled contempt for the pro-Telangana TDP leaders deserved them the title Mir Jafar in 'Group category'. The acceptance of Deputy CM post by Damodara Rajnarsimha, Deputy Speaker post by Bhatti Vikramarka is another case in point. When hundreds of agitators died and thousands put their life at risk participating in the movement these spineless leaders once again bargained self respect for the power. The irony of the Telangana movement is that people's fight for throwing the Seemandhra vested interests yoke resulted in the selection of their puppets to the high office!  Another duo of Danam Nagender and Mukesh Goud have been living Mir Jafar to the core. But the 'Best Mir Jafar enactment' must go to Sangareddy MLA T. Jayaprakash Reddy.  When the Congress leaders announced their decision to resign en masse, he became the lone hope for the Seemadhra leaders and vested interests - not to forget the Seemandhra news channels. Can't help but feel pity of the anti-Telangana movement! 

   

There were Mir Jafars. There are and there will be. Time and space may differ but their modus operandi remains the same just as their masters' barbaric means to achieve the rapacious ends. What would also not change is the ignominy they face at the end of the story!


Wednesday, May 11, 2011

Catch them young!

One of my close uncles visited my house and I offered to drop him at his place. On the way, he asked me to drive to a different place. And for what? 'To check the photoes of girls for a match!' For a match with a 20-day beard and clothes that would put a street vendor who sells used clothes to shame! I became speechless for a while but couldn't say no for reasons intrinsic and extrinsic! We reached the place and met a person who looked a typical 'poojari'.

He opened his yahoo mail and there comes a page full of young girls! I was moving impatiently for I never believed in this kind of stupidity! Choosing girl(s) on the 'face value'! Worse still rejecting girls on 'face value'! Long back I myself wrote - 'if you are incompetent - no pun intended - you may well become inhuman in due course!'. A serious quote if you think! Never did I think it comes back to me boomeranged! Now, I can neither run around trees ( read Coffee Shops, Lumbini Parks or I MAX halls) nor can I go against what I had been 'preaching' all along from my college days! I am sure there are atleast a few who are sharpening their swords for my head! Never mind.

A mind full of conflicting thoughts! Then came the wife of the person. 'It became a headache searching for girls! It's the time of the girls! They have so many conditions for and expectations of the boys!'. I then came to know that the photoes being shown to me are in fact came for their son! Either rejected or got rejected! Half-dead!! Felt like running away! Then the person clicked on the thumbnail to enlarge it. It was taking all the time in the world to download! Indifferent till that time, I became a little curious! 'Andee andani andame muddu!' Wait wasn't worth!

The person turned to me and asked, 'Do you have any chance of going abroad?'. 'I am not interested!' - said I. Because the next girl stays in US and wants a groom who's settled there! In fact there were two categories of girls - one who want a groom who has no plans of going abroad and the other who want one who intend to abroad! I belong to neither for I never 'wanted' to go abroad, nor do I resist the idea of going! An absolute non-believer in planning!

Some more photoes but the doors of the heart never really opened - even a wee bit! Then came a girl - who looked good even in a thumbnail. But the person wasn't interested! He said the girl is 'chamana chaya' (wheatish colour). 'Is it OK if the girl is chamana chaya?' Felt like hitting my head on to a wall! I said colour is not a problem. He still was not opening it giving some other reason! I looked firm and insistent! He was smart enough to read me! The girl looked fine to me. Details noted down. Then some more photoes browsed but to no effect.

Panchangam was taken out to check the 'compatibility'! A score of 27 on 36! 2 plus 7 is 9. And 9 is a lucky number! Then the person rang to the father of the girl zeroed-in! The girl works for a noted software firm. Was I a bit nervous? I don't know! I was almost evesdropping what the other person was speaking, though. Some details from my side been passed. They cited that that there's a 7 years of gap between us! Heartbreak! I know that was an anachronism for saying no to a person! Sounded familiar - a deja vu! And on top of it the person started saying - 'this boy looks hundred times better than your girl! That's why I am saying, don't mind we rejected your girl but I am compensating with this!' What to say of that exaspearatingly eccentric person! You read the above lines again! But the girl looked fine really! Then came the shock of the day! The girl belong to the same 'gothra'! All the doors opened yet crash-closed in a flash! Back to square one!

The search resumed! I regrouped from the 'setback'! That watermelon they served did help! He asked me again if I really had no chance of going abroad. I said, ' I said I am not interested'. Then he took my palm into his and looked at me as if I were a fool. I was surprised by his looks. He said, 'You will go abroad!'. I was bemused. Not because he said that I will go abroad! I was thinking if he now tries convincing people that I will some day land up in a foreign nation and sets up marriage on that 'post-dated' cheque! I didn't respond. Then stopped at a girl who looked really pretty! I asked what she does. ' Works for a --TV'. 'Then she must be from Andhra' - I said. Then my uncle said that I am an active participant in the Telangana movement and so may not prefer a girl from Andhra! I stopped him midway and corrected him. I said, 'as I take part in the movement that girl may not be interested!' It was the second time I had to say this. Because I have no problem with someone saying 'Jai Samaikyandhra', but I sure will ask for the justification. And I am sure I can convince them on my view! We have been trying to convince people and are open to get convinced! No one really put up a worthwhile argument yet!

It didn't go further! Then suddenly the person jumped out of his seat and asked if 'ashlesha - 4' girl is OK? I got perplexed! Now what was that? Right at the moment my father called me and I directed the question to my father. Then they talked for a while. You should see the ecstacy of the person! My uncle asked what does the girl do. I think he asked it for five times and the man 'on the cloud nine' refuses to heed! 'She is an advocate' - he replied. He for the first time cared to ask me if I were interested in an LLB? I whispered in my uncle's ears - advocate or journalist is in fact great for me, coz they can understand my 'language' better. He jumped out of the seat for a second time! Now he said - 'You stay here in our house today, we'll go to the girl's house tomorrow.' I said, 'my house is nearby, I can as well come tomorrow morning.' He said, 'I don't want to leave you.' Now what does that mean? This guy given slightest of room will even marry me to the girl if that girl expresses interest! Don's ask if he cares about how I feel? I scratched my uncle with my sight, he understood it rightaway! I almost ran out of the house lest the person would catch me again!

All along the 15 minutes drive from there to my house I was laughing all by myself, at times screaming! Went by the memory lane to recollect that gorgeous Soundarya in the movie 'Raja' who tickled manhood in me for the first time! Then Arti Agarwal stayed as a woman of my liking for a few years. And so on... There were some who liked me and some others whom I liked. But the problem has been, I didn't like those who liked me and they didn't like me whom I liked! Sort of a deadlock - for only the God to solve! Beware guys, particularly those who are in their early twenties! It is the time of the Girls. And so the moral of the story is: CATCH THEM YOUNG!!!

Monday, May 09, 2011

'Aa challani samudra garbham' by Dasarathi

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో

ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో  ||ఆ చల్లని||


భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో

ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో

ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో

కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో  ||ఆ చల్లని||


మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో

రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో

కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో

భూస్వాముల  దౌర్జన్యాలకు

ధనవంతుల దుర్మార్గాలకు

దగ్ధమైన బతుకులు ఎన్నో  ||ఆ చల్లని||


అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం

కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో

పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||