Wednesday, June 23, 2010

gal gal - Nuvvostaanante Nenoddantana

Music: Devi Sri Prasad  Lyrics: Seetarama Sastry

పల్లవి:  గల్ గల్ గల్ గల్ గలన్ గలన్ గల్ గల్ గల్
గల్ గల్ గల్ గల్ గలన్ గలన్ గల్ గల్ గల్
ఆకాశం తాకేలా వడగాలి ఈ నేలా అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
అణువణువును మీటే మమతల మౌనం
పదపదమంటే నిలవదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించీ
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ||గల్ గల్||

చరణం1:
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
దరి దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
సిరి పైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలను పెంచిన తొలి పిలుపేదంటే ||గల్ గల్||


చరణం2:
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంత విరబూసే గాయాలే వరమాలై దరి చేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానై అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెదికే సంక్రాంతి ఎదురవదా ||గల్ గల్||

Tuesday, June 22, 2010

Varsham - Mellaga Karaganee

I am an ardent admirer of Seetarama Sastry's lyrics. Let me start with 2 of his songs.

మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం


పల్లవి: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం
చల్లగా తెరవనీ గుండె తలపుల ద్వారం
వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం
తడిపీ తడిపీ తనతో నడిపీ హరివిల్లులు వంతెన వేసిన శుభవేళా.. ఆ.. ఆ..
ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం.. మెల్లగా



చరణం 1 : నీ మెలికల లోనా ఆ మెరుపును చూస్తున్నా
ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా
ఆ ఉరుముల లోనా నీ పిలుపుని వింటున్నా
ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా
జతపడే స్నేహమై అనునయించనా....
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియము తడబడి నిని విడదా....
||ఈ వర్షం సాక్షిగా||

చరణం 2: ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరునుణికే రుణపడి పోనా ఈ పైనా
త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా
విడుదలే వద్దనే ముడులు వేయనా
మన కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేలా...
||ఈ వర్షం సాక్షిగా||   ||మెల్లగా||